సారథి న్యూస్, కర్నూలు: అపరిచిత వ్యక్తుల ఫోన్‌కాల్స్, సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ కె.ఫక్కీరప్ప సూచించారు. డేటింగ్ వెబ్ సైట్స్ లో రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన మొబైల్ నంబర్స్‌ను వాట్సప్‌ద్వారా పరిచయం చేసుకుంటారని, మిమ్మల్ని మాయమాటలతో గారడీ చేసి ఫోర్న్సైట్ల నుంచి తీసుకున్న వీడియోలతో బ్లాక్మెయిల్చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. తరువాత డబ్బుల కోసం బెదిరించడం మొదలుపెడతారని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని లేదా సైబర్ మిత్ర వాట్సప్ నం.9121211100కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
- September 25, 2020
- Archive
- కర్నూలు
- క్రైమ్
- లోకల్ న్యూస్
- CYBER CRIME
- Kurnool
- SP FAKKIRAPPA
- ఎస్పీ ఫక్కీరప్ప
- కర్నూలు
- సైబర్ నేరగాళ్లు
- Comments Off on సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి