సారథి న్యూస్, రంగారెడ్డి: లాక్ డౌన్ నేపథ్యంలో శ్వాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 16 రోజులుగా పేదలు, మున్సిపల్ కార్మికులు, పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బందికి రాగి అంబలి, పులిహోరా ప్యాకెట్లు, ఉప్మా, దద్దోజనం వంటి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తూ ఆకలి తీరుస్తున్నారు. సంస్థ చైర్మన్ కాటెపాక ప్రవీణ్ కుమార్, అధ్యక్షుడు దోమలపల్లి లక్ష్మణ్ కొత్తపేట, ఎల్బీ నగర్, హయత్ నగర్, అబ్దుల్లా పూర్ మెట్, బాటసింగారం, కొత్త గూడెం చౌరస్తాలో ఆదివారం నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ప్రతిరోజూ దాదాపు 250 మందికి పైగా తమవంతు సాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించి కరోనా మహమ్మారిని అరికట్టాలని సూచించారు. కార్యక్రమంలో శ్వాస స్వచ్ఛంద సంస్థ గౌరవ సలహాదారులు దుబ్బాక సురేష్, అడాల యాదగిరి, చిన్నపాగ పురుషోత్తం, ఆర్గనైజర్స్ గూడెటి లింగస్వామి, జెనిగె శివ, జెనిగె మహేందర్, సింగిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మల్లికార్జున్, రోహిత్ మహారాజ్, గంగని ప్రవీణ్, పొలిపాక కిరణ్, గంగని శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
- April 19, 2020
- Top News
- లోకల్ న్యూస్
- లాక్ డౌన్
- Comments Off on సేవే ‘శ్వాస’గా..