సూపర్ హీరో సినిమాలకు ఇప్పటివరకు దూరంగా ఉన్న సల్మాన్ ఖాన్.. ఇకపై అలాంటి సినిమాలతో కూడా అభిమానులను అలరించనున్నాడట. ధూమ్, క్రిష్ లాంటి సూపర్ హీరో సినిమాలు చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. సల్మాన్ ను సూపర్ హీరోగా తీర్చిదిద్దేందుకు అలీ అబ్బాస్ జాఫర్ సన్నాహాలు మొదలెట్టేసాడట. అనుకున్నదే తడవుగా ఒకటి, రెండు కాదు.. ఏకంగా నాలుగు సూపర్ హీరో సినిమాల్ని వరుసగా తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడట జాఫర్. సల్మాన్, కత్రినా, అలీ అబ్బాస్ జాఫర్ కాంబినేషన్ లో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై వంటి బ్లాక్ బస్టర్లు వచ్చాయి. సల్మాన్, కత్రినాను సూపర్ హీరోలుగా చూపించాలనే ఆలోచనతో చాలాకాలంగా అలీ అబ్బాస్ స్క్రిప్ట్ తయారు చేస్తున్నట్టు తెలుస్తున్నది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘వీరంతా ఒకే యూనివర్స్ లో భాగం అవుతారు. అది సూపర్ హీరో యూనివర్స్. మొదటి చిత్రంలో కత్రినా కైఫ్ నటించనుంది’ అంటూ చెప్పాడు. ఈ ఫ్రాంఛైజీలో నాలుగు సినిమాల కథలు వేటికవే డిఫరెంట్గా ఉంటాయిట. కానీ వాటి లింక్ మాత్రం ఎక్కడా మిస్ అవకుండా కథలను సిద్ధం చేస్తున్నారట. భారతీయ పురాణేతిహాసాల నుంచి ఒక సూపర్ హీరో రోల్ .. ఇండియన్ ఆర్మీ నుంచి ఒక సూపర్ హీరో రోల్ ని క్రియేట్ చేస్తున్నట్టు సమాచారం. సల్మాన్‌ఖాన్‌ను సూపర్ హీరో తరహా పాత్రలో చూపించేందుకు ‘మిస్టర్ ఇండియా’ తరహా కాన్సెప్టునే ఇన్సిపిరేషన్ గా తీసుకున్నట్లు జాఫర్ చెప్పాడు. సూపర్ హీరో అంటే హృతిక్ అనే భావనలో ఉన్నవారు సల్మాన్ తొలిసారిగా నటించనున్న సూపర్ హీరో పాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాల్సిందే.
- June 21, 2020
- Archive
- సినిమా
- DIRECTOR
- KATRINA
- SALMANKHAN
- SUPERHERO
- జాఫర్
- సూపర్ హీరో
- Comments Off on సూపర్ హీరోగా సల్మాన్