Breaking News

సుశాంత్‌.. నీ బాధ నాకు తెలుసు

  • సుశాంత్‌ రాజ్‌పుత్‌ అక్క భావోద్వేగ పోస్ట్‌


ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సోదరి శ్వేతాసింగ్‌ కృతి ఫేస్‌బుక్‌లో భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు. తన సోదరుడి ఆత్మకు శాంతి కలగాలని ప్రతిఒక్కరూ ప్రార్థించాలని ఆమె కోరారు. ‘సుశాంత్‌.. నువ్వెంత బాధపడ్డావో నాకు తెలుసు. మేరా బేబీ, మేరా బాబు.. ఇకపై నువ్వు మా మధ్య భౌతికంగా లేవు. సారీ మేరా సోనా.. నువ్వు ఎంతో బాధలో ఉన్నావని, పోరాట యోధుడిలా పోరాడవని నాకు తెలుసు. నువ్వు ఇన్నాళ్లు అనుభవించిన బాధలకు నేను క్షమాపణలు కోరుతున్నాను. నాకే అవకాశం ఉంటే నీ బాధను నేను తీసుకుని ఆనందాన్ని నీకు ఇచ్చేదాన్ని.

నిష్కలమైన నీ నవ్వు ప్రపంచానికి ఎంతో నేర్పించింది. ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. సంతోషంగా ఉండు. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ప్రతిఒక్కరూ నిన్ను ఇష్టపడతారు. ఇది కష్టసమయం అని నాకు తెలుసు. మీకు ఏ కొంచెం అవకాశం వచ్చినా సరే ప్రతి ఒక్కరిని ప్రేమించిండి. కోపానికి బదులు ప్రేమ, ఆప్యాయత పంచండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారి వ్యక్తిగత విషయాలతో పోరాడుతుంటారు’ అని శ్వేతా పోస్ట్‌ చేశారు. ‘కేదార్‌‌నాథ్‌’, ‘చిచోరే’ లాంటి మంచి సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ముంబైలోని తన ఇంట్లో సూసైడ్‌ చేసుకుని చనిపోయారు. ఆ సమయంలో శ్వేతా అమెరికాలో ఉన్నారు. దీంతో ఆమె సుశాంత్‌ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. కాగా.. సుశాంత్‌ మరణవార్త విని షాక్‌లోకి వెళ్లిన ఆయన వదిన కూడా చనిపోయారు.