Breaking News

‘సుంద‌రాంగుడు‘ ముస్తాబు

‘సుంద‌రాంగుడు‘ ముస్తాబు

ఎమ్ ఎస్ కే ప్రమీదశ్రీ ఫిలింస్ ప‌తాకంపై కృష్ణసాయి, దేవ‌క‌న్య మౌర్యాని హీరోహీరోయిన్లుగా ఎం.విన‌య్ బాబు ద‌ర్శకత్వంలో బీసుచంద‌ర్ గౌడ్ నిర్మిస్తున్న రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ ‘సుంద‌రాంగుడు’. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్​ ప‌నులు ప్రారంభించింది.
ఈ సందర్భంగా హీరో స్పెషల్ స్టార్ కృష్ణసాయి మాట్లాడుతూ..‘హీరోగా చేయాలన్నది నా కోరిక. సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమానిని.. కృష్ణ సినిమాలు ప్రతి సినిమా చూసేవాణ్ణి. ఒక మంచి సినిమా చేయాల‌ని అనుకుంటున్న తరుణంలో మంచి కథ‌తో వ‌చ్చారు డైరెక్టర్ వినయ్ బాబు. సుందరాంగుడు కథ, కథనాలు నాకు బాగా నచ్చాయి. నా బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా స్టోరీ ఉంటుంది. ఇక పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. సుందరాంగుడు అన్ని సినిమాల లాగా కాదు. విభిన్నమైన కామెడీ సినిమా..

ఈ సినిమాలో హీరో క్యారక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. హీరో .. జమీందార్.. బిడ్డ… డబ్బు అహంకారంతో అన్ని నాకే దక్కాలని.. అందమైన అమ్మాయిలను వశపర్చుకోవాలని వెంట పడుతుంటాడు. కానీ అతనికి ఏ ఒక్క అమ్మాయి పడకపోగా, ప్రతి అమ్మాయి అవమానిస్తుంది. తనను అవమానించిన అమ్మాయిలను ఎలా వశపర్చుకున్నాడు అన్నది కథ. మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు.. మనిషి మనసు సుందరంగా ఉండాలి కానీ.. మనిషి సుందరంగా ఉన్నంత మాత్రాన నిజమైన అందగాడు కాదు.. మనిషికి మంచి మనసే నిజమైన అందం అనే అంశాన్ని మా సినిమాలో చెబుతున్నాం’ అని చెప్పాడు.

హీరోయిన్ మౌర్యాని మాట్లాడుతూ ‘ఇందులో నా పాత్ర పేరు దేవకన్య. నా క్యారెక్టర్ కు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. డైరెక్టర్ వినయ్ బాబు సబ్జెక్ట్ చాలా బాగా డిజైన్ చేశారు. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కామెడీ సినిమాలు వచ్చాయి.. కానీ ఇలాంటి కథ, కథనాల‌తో ఇప్పటివరకు ఏ సినిమా రాలేదు. అందుకే ఈ ‘సుందరాంగుడు’ సినిమా అన్ని సినిమాల్లో ఒక ప్రత్యేకమైన సినిమా’ చెప్పింది.దర్శకుడు విన‌య్ బాబు మాట్లాడుతూ..‘ సుంద‌రాంగుడు సినిమా ఒక మంచి టానిక్ లాంటి కామెడీ సినిమా. ఇది అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే సినిమా.. శివుడి మీద వ‌చ్చే పాట సినిమాసకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.

లాక్ డౌన్ వ‌ల్ల సినిమా కొంచెం లేట‌యింది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్​ ప‌నులు ప్రారంభించాం. సుంద‌రాంగుడు సినిమా ఒక ప్రముఖ సంస్థ రిలీజ్ చేయ‌డానికి ముందుకొచ్చింది. త్వర‌లో ఆ వివ‌రాలు వెల్లడిస్తాం. ఇక మా నిర్మాత ఎక్కడా రాజీపడ‌కుండా సినిమాను నిర్మించారు. అలాగే మా హీరో కృష్ణసాయి సుంద‌రాంగుడు పాత్రకు ప్రాణం పోశాడు. ఈ సినిమా హీరోగా త‌న‌కు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది’ అన్నారు. ఈ చిత్రంలో విల‌న్‌గా అమిత్ తివారీ న‌టిస్తున్నాడు. మిగ‌తా పాత్రల్లో జీవా, జూ రేలంగి, బాషా, మిర్చి మాధవి, శివకృష్ణ న‌టిస్తున్నారు.


ఎడిటింగ్: నందమూరి హరి
ఫైట్స్:
రామ్ సుంకర
కొరియోగ్రఫీ:
పాల్, సూర్యకిరణ్
డీవోపీ:
వెంకట్ హనుమాన్
మ్యూజిక్:
సిద్ధబాపు
కథ, కథనం, మాటలు, పాటలు, దర్శకత్వం:
ఎం.వినయ్ బాబు
నిర్మాత:
బీసు చందర్ గౌడ్