మంగళూరు: 20 మంది మహిళలపై అత్యాచారం చేసి వారిపై సైనేడ్ ప్రయోగించి చంపేసిన సీరియల్ కిల్లర్ మోహన్‌కు కేరళ సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2009లో కేరళకు చెందిన57 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి చంపేసిన కేసులో కోర్టు మోహన్‌ను దోషిగా తేల్చింది. ఇతను గతంలో మరో 19 మంది మహిళలపై కూడా అత్యాచారం చేసి హత్య చేసినట్లు అధికారులు చెప్పారు. కాగా, ఇప్పుడు కాసర్‌గోడ్‌కు చెందిన 25 ఏళ్ల మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించి బెంగళూరు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గర్భం రాకుండా ట్యాబ్లెట్ అని నమ్మించి సైనేడ్ పూసిన మాత్రను ఆమెకు ఇచ్చాడు. దీంతో ఆమె మరణించింది.
ఈ కేసుకు సంబంధించి 89 ఆధారాలను పరిశీలించి, 46 మంది సాక్షులను విచారించిన జిల్లా సెషన్స్ కోర్టు మోహన్‌కు యావజ్జీవ కారాగాశిక్ష విధించారు. మృతురాలి దగ్గర మోహన్ దొంగలించిన ఆభరణాలను ఆమె తల్లికి అందించాలని కోర్టు ఆదేశించింది. మోహన్ గతంలో కూడా ఇలానే మహిళలను సైనేడ్ ఉపయోగించి చంపేసినట్లు దర్యాప్తులో తేలింది. మిగిలిన హత్యాచార కేసుల్లో ఇప్పటిక మోహన్‌కు వివిధ న్యాయస్థనాలు ఐదు మరణ శిక్ష, జీవిత కాలశిక్ష విధించాయి. కాగా.. వాటిలో రెండు మరణ శిక్షలను జీవిత ఖైదీగా మార్చారు.