సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోనే తొలిసారిగా ఆపిల్ పండ్లు పండించిన కొమురంభీం జిల్లా రైతు కెంద్రె బాలాజీ తొలికాతను మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎంకు మొక్కతో పాటు పండ్ల బుట్టను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన రైతు బాలాజీ రెండు ఎకరాల్లో హెచ్ఆర్ 99 రకం ఆపిల్ పంటను సాగుచేశాడు. సాగులో ఉద్యానవన శాఖ అధికారులు ప్రోత్సాహం అందించారని తెలిపారు. సీఎం ప్రోత్సాహంతోనే పంట పండించినట్లు తెలిపారు. పంట సాగుపై మరింత దృష్టిసారిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రైతు బాలాజీని సీఎం కేసీఆర్ అభినందించారు.
- June 2, 2020
- Top News
- హైదరాబాద్
- APPLE
- CM KCR
- TELANGANA
- ఆపిల్ పండ్లు
- కెరమెరి
- కొమురంభీం
- ధనోరా
- Comments Off on సీఎంకు తెలంగాణ యాపిల్