కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచీ తమన్నా గ్యాప్ లేకుండా వరుస చిత్రాలతో అలరిస్తూనే ఉంది. యంగ్, సీనియర్స్ అని జనరేషన్ తేడా లేకుండా అందరి హీరోలతో కలసి నటిస్తోంది. ఈ మధ్య అయితే గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఇంటెన్సిటీ ఉన్న రోల్స్ కూడా చేస్తోంది. సిటీమార్, గుర్తుందా శీతాకాలం, అంధాధూన్ రీమేక్ లతో పాటు బాలీవుడ్ మూవీ ‘బోలే చుడియాన్’ లో కూడా నటిస్తోంది. వరుస చిత్రాలు చేస్తున్నా మరో పక్క వెబ్ సిరీస్ లలో కూడా మెరవనుంది తమన్నా. ఆల్రెడీ ఆమె నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘నవంబర్ స్టోరీస్’ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ లోపు ‘పీఎస్వీ గరుడవేగ’ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో రూపొందబోయే ‘11త్ అవర్’ సిరీస్కు కమిటైంది. రీసెంట్ గా ‘సామ్ జామ్’ షో కి విచ్చేసిన తమన్నా తన మనసులోని మాటలను షేర్ చేసుకుంటూ ‘మనం చేసే ప్రతి పనికీ ఒక ప్రయోజనం ఉండే తీరుతుందని నమ్ముతాను.. సినిమా నాకు చాలా అవకాశాలిచ్చింది.. ఇకమీదట ఓటీటీలో కూడా ఎక్స్ఫ్లోర్అవ్వాలనుకుంటున్నా.. కొన్ని ప్రాజెక్టులకు కమిట్మెంట్ఇచ్చా.. హోస్టింగ్ కూడా చేయాలనుకుంటున్నాను. ఆడవాళ్లు మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ అన్నది ప్రూవ్ చేయాలన్నదే నా ఉద్దేశం..’ అంటూ చెప్పింది. సినిమాలు, సిరీస్ లతో వచ్చే యేడు మరింత బిజీ అయిపోయేట్టు ఉంది తమన్నా.
- December 16, 2020
- Archive
- షార్ట్ న్యూస్
- సినిమా
- GARUDAVEGA
- OTT
- SAMJAM
- TAMANNAH
- ఓటీటీ
- తమన్నా
- సామ్ జామ్
- సిటీమార్
- Comments Off on సినిమాలు, సిరీస్ లతో బిజీ