సారథి న్యూస్, రామగుండం: సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామయ్య డిమాండ్ చేశారు. గురువారం జరిగిన గేట్మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం ఉన్నకార్మికులపై పనిభారం పెరిగిందన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మేరుగు రాజయ్య, మహేందర్ రావు, కె.కనకరాజు, బళ్లు రవి, భోగ సతీష్, భాస్కర్, అబ్దుల్ కరీం, గంగారపు చంద్రయ్యతో పాటు కార్మికులు పాల్గొన్నారు.
- January 7, 2021
- Archive
- Top News
- AITUC
- GATEMEETING
- SINGARENI
- ఏఐటీయూసీ
- గేట్మీటింగ్
- సింగరేణి
- Comments Off on సింగరేణిలో ఖాళీ పోస్టులను భర్తీచేయాలి