Breaking News

సారీ.. సామి

సారీ.. సామి

న్యూఢిల్లీ: వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామిపై.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని సామి ధ్రువీకరించాడు. ఇషాంత్ దురుద్దేశంతో అలా పిలువలేదని విండీస్ క్రికెటర్ వెల్లడించాడు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నానని, ఈసారి కలిసినప్పుడు ఇషాంత్ను మనసారా కౌగిలించుకుంటానన్నాడు.

‘ఏ ఆటగాడైనా సరే.. జాతి, వర్ణ వివక్షకు దూరంగా ఉండడం చాలా మంచిది. క్రికెట్లోనూ ఈ వివక్ష ఉండకూడదు. ఇషాంత్ కూడా ఉద్దేశపూర్వకంగా అలా పిలువలేదని నేను భావిస్తున్నా. వర్ణ వివక్షను ఏయే సంస్కృతులను ఎలా గౌరవిస్తాయో తెలుసుకోవాలి. అప్పుడు ఇలాంటి ఇబ్బందులు రావు. భారత్​లో నాకు చాలా మధుర స్మృతులు ఉన్నాయి. ప్లేయర్, కోచ్, మెంటార్​గా ఏ పాత్రలోనైనా భారత్లో పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఇషాంత్, నేను సోదరులుగానే కలిసి ఉంటాం’ అని సామి వ్యాఖ్యానించాడు.