Breaking News

సారీ.. నేను కొనసాగలేను!

ఢిల్లీ: ఏఐసీసీ ( ఆల్​ఇండియా కాంగ్రెస్​ కమిటీ) కొత్త అధ్యక్షులు ఎవరు అన్నదానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్​కు కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సీడబ్ల్యూసీ ( కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ) సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని సమచారం. అయితే సమావేశంలో పలు ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. అధ్యక్షురాలిగా తాను కొనసాగలేనని సోనియాగాంధీ తేల్చిచెప్పనట్టు సమాచారం. ఈ భేటీపై కాంగ్రెస్​ శ్రేణులే కాదు.. యావత్​ భారతదేశం ఆసక్తిని కనబరుస్తున్నది. అందుకు కారణం ఈ భేటీ అనంతరం కాంగ్రెస్​కు కొత్త అధ్యక్షుడు ఎన్నికవుతాడని విస్తృత ప్రచారం జరగడమే. అయితే వీడియో కాన్ఫరెన్స్​ ద్వారాల జరిగిన సమావేశంలో మొత్తం 48 మంది పాల్గొన్నారు. సీడబ్ల్యూసీ సభ్యులతోపాటు కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సీనియర్​ నేతలు పాల్గొన్నారు. కాగా గాంధీ కుటుంబీకులే తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని మెజార్జీ నేతలు అభిప్రాయపడ్డట్టు సమాచారం. రాహుల్​ గాంధీ అధ్యక్ష పదవి చేపట్టడానికి అయిష్టత చూపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.