Breaking News

సాంకేతిక విప్లవానికి రాజీవ్​ నాంది

సాంకేతిక విప్లవానికి రాజీవ్​నాంది

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ప్రధానమంత్రి రాజీవ్​గాంధీ 76 జయంతి వేడుకలను కాంగ్రెస్​పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ఘనంగా నిర్వహించారు. సీ క్యాంపు సెంటర్​లో రాజీవ్​గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పుల్లారెడ్డి కాలేజీ వద్ద ఉన్న అనాథ బాలబాలికలకు పండ్లు, బ్రెడ్డు అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవానికి రూపకల్పన చేశారని కొనియాడారు. నేడు సెల్ ఫోన్ వినియోగం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందంటే ఆయన చేసిన కృషిమాత్రమేనని కొనియాడారు. రైల్వేటికెట్లను ఆన్​లైన్ లో ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. నవోదయ విద్యాలయాలను ఏర్పాటుచేసి గ్రామీణ పేద విద్యార్థులకు మంచి విద్య అందించారని కొనియాడారు. నంద్యాల డీసీసీ అధ్యక్షుడు జై లక్ష్మీనరసింహ యాదవ్ మాట్లాడుతూ.. దేశం కోసం రాజీవ్​గాంధీ త్యాగం మరవలేనిదన్నారు. కార్యక్రమంలో ఎన్ ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.నాగమధు యాదవ్, నందికొట్కూరు అశోకరత్నం, మైనార్టీ నాయకులు పఠాన్ హబీబ్ ఖాన్, బీసీ సెల్ రాష్ట్ర నాయకులు బోయ నాగరాజు, డోన్ సాయి, జనార్ధన్, హుస్సేన్, లక్ష్మన్న, వీరేష్ యాదవ్ పాల్గొన్నారు.