సారథి న్యూస్, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మరగ్రామంలో దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్రకుమార్ను దేవాలయ భూముల పరిరక్షణ సమితి సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా వారు నర్సింహాపురం గ్రామంలోని కోదండరామ స్వామి దేవాలయం భూములు సర్వే చేయించాలని వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ పనులు ప్రారంభిస్తే సర్వేకు ఇబ్బంది అవుతుందని త్వరితగతిన అన్యాక్రాంతమైన భూములను గుర్తించి సర్వే చేయించి దేవాలయం అభివృద్ధి కి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సమితి గౌరవ సలహాదారులు వేమూరి సత్యనారాయణ, అధ్యక్షుడు కిన్నెర నాగరాజు, ఉపాధ్యక్షుడు కిన్నెర వెంకటేశ్, కోశాధికారి రేవూరి బాబు సభ్యులు బారి లక్ష్మయ్య పాల్గొన్నారు.
- July 16, 2020
- Archive
- నల్లగొండ
- షార్ట్ న్యూస్
- LAND
- TAMMARA
- TEMPLE
- తమ్మర
- దేవాలయం
- భూమి
- Comments Off on సర్వే చేయించండి సారూ..