సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో జరిగే వారంతపు సంతలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కరోనా వేళ సంతకు ప్రజల రాకపోకలు కొంత మేర తగ్గించినప్పటికీ కూరగాయలు, తృణధాన్యాలు, దుస్తులు, మసాలాలు, చిన్నచిన్న వస్తువుల కోసం ఈ సంతకే వస్తుంటారు. కానీ ఇక్కడ కనీసవసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంత సమీపంలో పైకప్పులేని డ్రైనేజీ ఉండటంతో దుర్వాసన వెదజల్లుతున్నది. పంచాయతీ సిబ్బంది మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్నప్పటి.. పట్టించుకోవడం లేదు. రైతులు, వ్యాపారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సమస్యలు పరిష్కరిస్తాం
సంతను మరొకచోటుకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నాం. ఆంధ్రాబ్యాంక్ సమీపంలోని మార్కండేయ గుడి వెనకాల ఉన్న స్థలంలో సంతను ఏర్పాటుచేస్తాం. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తాం. మంచినీటి వసతి కల్పిస్తాం.
:: సర్పంచ్ ప్రమీళ