శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం వారు బుధవారం ఉదయం సాక్షి గణపతిస్వామి వారికి విశేష అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, పలు ఫలోదకాలతోనూ హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో పూజలు చేశారు. తర్వాత స్వామివారికి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపించారు. వైదిక సంప్రదాయాల్లో గణపతి అభిషేకానికి ఎంతో విశిష్టత ఉంది. అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెరిగి చదువు బాగా వస్తుందని చెబుతుంటారు. భౌతికదూరాన్ని పాటిస్తూ అర్చకస్వాములు సాక్షి గణపతి వారికి విశేష అర్చనలు జరిపించారని ఈవో రామారావు తెలిపారు.
- August 19, 2020
- Archive
- ఆధ్యాత్మికం
- SAKSHIGANAPATHI
- SRISAILAM
- TEMPLE EO
- ఈవో
- శ్రీశైలం
- సాక్షిగణపతి
- Comments Off on శ్రీశైలం సాక్షి గణపతి విశేష అభిషేకం