అడవి శేష్ హీరోగా సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ఎస్ మూవీస్ తో కలిసి హీరో మహేష్ బాబు నిర్మిస్తున్న చిత్రం ‘మేజర్’. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు శేష్. ‘మేజర్’ ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. 26/11 ముంబై టెర్రరిస్ట్ అటాక్‌లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఇది. శశికిరణ్ తిక్క దర్శకుడు.. శేష్ బర్త్ డే సందర్భంగా గురువారం ఫస్ట్ లుక్‌ను మహేష్ బాబు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ‘మేజర్’గా ఇంటెన్స్ లుక్‌తో ఇంప్రెస్ చేస్తున్నాడు శేష్. లాక్‌డౌన్‌తో ఆగిపోయిన షూటింగ్‌ను ఆగస్టులో తిరిగి స్టార్ట్ చేసిన టీమ్, ఇప్పటివరకూ 70శాతం వరకూ షూటింగ్ కంప్లీట్ చేశారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. శోభితా దూళిపాళ, సయీమంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీశర్మ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
- December 17, 2020
- Archive
- సినిమా
- ADAVISHESH
- MAJOR
- MAJOR SANDEEP UNNIKRISHNAN
- అడవి శేష్
- మేజర్
- మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్
- లాక్డౌన్
- Comments Off on శేష్.. స్ట్రాంగ్ మేజర్