‘గూఢచారి’, ‘ఎవరు’ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు అడవి శేష్. గూఢచారి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యానర్ జీఎంబీలో తన తర్వాత సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్లో ‘మేజర్’ సినిమా ప్రారంభమైంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే మేజర్ సినిమా చిత్రీకరణ ఎంతవరకూ పూర్తయింది అన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ సినిమా ఇంకా సెట్స్‌పై ఉండగానే మహేష్ బాబు, శర్వానంద్ హీరోగా మరో సినిమాను జీఎంబీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించాలని అనుకుంటున్నారట. అనుకున్నట్టే జరిగితే మరో రెండు మూడు వారాల వ్యవధిలో అధికారిక ప్రకటన వెలువరిస్తారట.
ప్రస్తుతం జీఎంబీ టీమ్ శర్వానంద్ కోసం స్క్రిప్టును ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. కథ ఏమిటని ఇంకా రివీల్ కాలేదు. శర్వానంద్ ఫ్లాపులతో ముందుకెళ్తున్నా సినిమా చాన్సులకు ఏమీ కొదవలేదు. ప్రస్తుతం ‘శ్రీకారం’ చిత్రం, డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ‘మహాసముద్రం’ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. నెక్ట్స్ మహేష్ బాబు సినిమాలో ఖాయం అనిపించుకున్నాడు.