Breaking News

వైభవంగా బోనాల వేడుకలు

వైభవంగా బోనాల వేడుకలు


సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో మంగళవారం గ్రామ దేవత పోచమ్మ బోనాల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో మహిళలు బోనం కుండలతో ఊరేగింపుగా అమ్మవారి దేవస్థానం వద్దకు తరలొచ్చారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యాలు సమర్పించారు. వేడుకల సందర్భంగా స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న అమ్మవారి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. పరిసరాలను మామిడి తోరణాలు, వేపాకుల మండలతో ముస్తాబు చేశారు.