సారథి న్యూస్, కర్నూలు: కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ వాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్సార్ సీపీ కర్నూలు నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెరనేకల్ సురేందర్ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టి హర్షం వ్యక్తంచేశారు. పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ఎస్సీసెల్కార్యదర్శి సీహెచ్.మద్దయ్య, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు కట్టారి సురేష్ కుమార్, యువజన విభాగం నగర అధ్యక్షుడు సోంపల్లి కృష్ణకాంత్ రెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్, కార్యదర్శి డీకే రాజశేఖర్, మైనార్టీ నాయకులు తౌఫిక్, పార్టీ సీనియర్ నాయకులు చందు, సంజు, దామోదర్, కిషోర్, మెహబూబ్, భారత్, తేజు, బుజ్జి, శ్రీను పాల్గొన్నారు.
- August 3, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- 3CAPITALS
- CM JAGANMOHANREDDY
- Kurnool
- RAYALASEEMA
- కర్నూలు
- రాయలసీమ
- వైఎస్సార్సీపీ
- Comments Off on వైఎస్సార్ సీపీ నేతల సంబరాలు