సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని కాంగ్రెస్నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం నంద్యాల చెక్ పోస్టు దామోదరం సంజీవయ్య సర్కిల్ సమీపంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్‌హయాంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. అప్పటి కాంగ్రెస్ప్రభుత్వం 104, 108సేవలు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాకు తాగు, సాగునీటిని అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కే దక్కిందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కృషిచేస్తుందన్నారు.
‘రాజన్న ఆశయాలు సాధిద్దాం.. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రి చేద్దాం’ అని పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రి చేయాలని మహానేత వైఎస్సార్ కలలుగన్నారని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భరత్ కుమార్ ఆచారి, కాంగ్రెస్ జిల్లా లీగల్ సెల్ బత్తుల చిన్నయ్య, జిల్లా మైనార్టీ నాయకులు పఠాన్ హబీబ్ ఖాన్, బీసీసెల్ నాయకులు బోయ నాగరాజు, యువజన కాంగ్రెస్ నాయకులు విజయ్ యాదవ్, అఖిల్, రాంబాబు, కాసీం, నాని కృష్ణారెడ్డి అయ్యన్న వెంకట్ నాయుడు, కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు సంధ్య, వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు.