ఈ వెబ్ సిరీస్‌ల ట్రెండ్ టాలీవుడ్లో బాగా ముదురుతోంది. సూపర్ స్టార్ సైతం దీని వైపు ఆసక్తిగా అడుగులు వేస్తున్నారని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కొరటాల శివ డైరెక్షన్లో తాను నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాను వెబ్ సినిమాగా నిర్మించాలని మహేష్ అనుకుంటున్నాడట. దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నాడని తాజా సమాచారం. కానీ బాక్సాఫీస్ బొనాంజాగా నిలిచిన ఈ సినిమాను జనాలు ఇప్పటికే థియేటర్లలో చూసేశారు. మరి వెబ్ సినిమాగా తీస్తే ప్రజలు ఆదరిస్తారో లేదో అన్నదే అనుమానం. కొంతమంది అయితే ఆయన సినిమా ఆయన ఇష్టం.. ఏమైనా చేసుకుంటాడులే అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వెబ్ సినిమాలో క్యారెక్టర్స్ ఎవరన్నది ఇంకా డిసైడ్ కాలేదు. మహేష్ బాబు హీరోగా చేస్తాడో లేదో కూడా తెలియాల్సి ఉంది. సూపర్‌స్టార్ మహేష్ ఈ వెబ్ సిరీస్‌తో తెలుగులో ఓ కొత్త అధ్యయాన్ని సృష్టించనున్నాడేమో చూడాలి మరి.
- June 4, 2020
- సినిమా
- MAHESH BABU
- TOLLYWOOD
- కొరటాల శివ
- వెబ్ సీరిస్
- శ్రీమంతుడు
- Comments Off on వెబ్ సీరిస్ వైపు సూపర్‌స్టార్