అర్జున్‌రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ వంగ ఓ వెబ్‌సీరీస్ తీసేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ వెబ్‌సీరీస్‌ను యంగ్ హీరో విజయ్ దేవరకొండ నిర్మించనున్నట్టు టాక్. అర్జున్‌రెడ్డి చిత్రాన్ని సందీప్‌వంగా హిందీలో కబీర్‌సింగ్‌గా తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు. అప్పటి నుంచి కొత్త ప్రాజెక్టులు ఏవీ ప్రకటించలేదు. ఈ క్రమంలో ఓ విభిన్న కథతో వెబ్‌సీరీస్‌ను తెరకెక్కెంచనున్నట్టు టాక్. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ లీడ్ పాత్రలో నటిస్తారట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం విజయ్.. పూరీ డైరెక్షన్లో ‘ఫైటర్’ అనే మూవీ చేస్తున్నాడు. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. కరోనా తగ్గాక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు.
- August 18, 2020
- Archive
- సినిమా
- ACTOR
- ARJUNREDDY
- DIRECTOR
- NEWPROJECT
- PRODUCER
- VIJAY DEVARAKONDA
- WEBSERIES
- అర్జున్‌రెడ్డి
- కొత్తచిత్రం
- డెరెక్టర్
- వెబ్‌సీరీస్
- సందీప్వంగ
- Comments Off on వెబ్‌సీరీస్ ప్లానింగ్‌లో అర్జున్‌రెడ్డి డైరెక్టర్