Breaking News

వెండితెర శకుంతల

వెండితెర శకుంతల

‘గద్దలకొండ గణేష్’ లో అచ్చతెలుగు అమ్మాయిలా అలరించిన పూజాహెగ్డే వచ్చే ఏడాది సంక్రాంతికి ‘రాధే శ్యామ్’ తో అభిమానులను అలరించనుంది. తర్వాత ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’తో సందడి చేయనుంది. ఇవి కాక బాలీవుడ్​లో భాయ్ సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కబీ దీవాలీ’లో నటిస్తోంది. రీసెంట్ గా ‘సర్కస్’ మూవీ కి కమిట్​మెంట్​ఇచ్చింది. ఇలా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ కన్నడ గాళ్ ఇప్పుడొక హిస్టారికల్ మూవీలో నటించనుందని టాక్. చారిత్రక కథలను అద్భుతంగా రూపొందించే డైరెక్టర్ గుణశేఖర్ ఈసారి శకుంతల దుష్యంతుల ప్రణయ గాధను తెరకెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నాడట. ఇందులో హీరోయిన్ శకుంతలగా ఇంతకుముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘రుద్రమదేవి’గా మెప్పించిన అనుష్కనే తీసుకోవాలనుకున్నాడట. ఇంతలో పూజాహెగ్డే పేరు కూడా తెరపైకొచ్చింది. పూజా అయితేనే కావ్య కథానాయిక పాత్రకు సూటవుతుందని.. శకుంతలగా ఆమె ఫెర్మామెన్స్​అదరగొడుతుందని అభిప్రాయపడుతున్నాడట. ఆల్​రెడీ పూజా కథ విన్నదని, ఆ రోల్ చేయడానికి తాను కూడా చాలా ఆసక్తిగా ఉందని అంటున్నారు. అఫీషియల్ వివరాలు ఇంకా తెలియరాలేదు కాబట్టి.. స్ర్కీన్ పై శకుంతల ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.