న్యూఢిల్లీ: చైనా చేసిన దాడి నేపథ్యంలో ఆ దేశ స్పాన్సర్లతో తెగదెంపులు చేసుకుంటామని భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) ప్రకటించినా.. బీసీసీఐ మాత్రం వెనుకడగు వేసింది. ఇప్పటికైతే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వివోతో తెగదెంపులు చేసుకునే అవకాశాలు ఇప్పటికైతే లేవని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ వెల్లడించాడు. తదుపరి ఒప్పందం కోసం స్పాన్సర్ షిప్ విధానంపై సమీక్షిస్తామని తెలిపింది. ప్రస్తుతం ఆర్థికాభివృద్ధికి సాయంగా నిలుస్తున్న వివోతో సంబంధాన్ని ముగించలేమన్నారు. ఏడాదికి రూ. 440 కోట్లు చెల్లించే విధంగా బీసీసీఐతో వివో కుదుర్చుకున్న ఐదేళ్ల ఒప్పందం 2022లో ముగుస్తుంది. ‘భావోద్వేగాలు ముందుకొచ్చినప్పుడు హేతుబద్దతను పక్కనబెట్టేస్తారు. చైనా కోసం ఆ దేశ సంస్థకు మద్దతివ్వడం లేదా భారత ప్రయోజనాల కోసం చైనా సంస్థ నుంచి సాయం పొందడం మధ్య తేడాను అర్థం చేసుకోవాలి. తమ ఉత్పత్తుల ద్వారా భారత్లో సంపాదించిన డబ్బును చైనా సంస్థలు బీసీసీఐకి చెల్లిస్తున్నాయి. ఇందులో నుంచి బోర్డు 42 శాతం పన్ను రూపంలో భారత ప్రభుత్వానికి కడుతున్నాయి. ఇది భారత్కు మేలు చేసినట్లు కాదా?’ అని ధుమాల్ వ్యాఖ్యానించాడు.
- June 19, 2020
- Archive
- క్రీడలు
- BCCI
- CHINA
- INDIA
- IOA
- VIVO
- అరుణ్ ధుమాల్
- స్పాన్సర్లు
- Comments Off on వీవోతో కొనసాగుతాం: ధుమాల్