హీరోగా, ప్రొడ్యూసర్ గా సినీ జర్నీ చేస్తున్న సందీప్ కిషన్ వెంకటాద్రి టాకీస్ బ్యానర్ పై ‘నిను వీడని నీడను నేను’, ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాల తర్వాత ఓ కామెడీ ఎంటర్ టైనర్ ను నిర్మిస్తున్నాడు. కమెడియన్ సత్య హీరోగా ‘వివాహ భోజనంబు’మూవీని కేఎస్. శినీష్ తో కలిసి తెరకెక్కిస్తున్నాడు. ఆర్జీవీ రాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ టీజర్ ను శుక్రవారం రిలీజ్ చేశారు. వైవాహర్ష, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్ తో పాటు నెల్లూరు ప్రభ అనే ప్రత్యేకపాత్రలో సందీప్ కిషన్ కనిపిస్తున్న టీజర్ ఎంటర్ టైనింగ్ గా ఉంది. పది రూపాయల పార్కింగ్ టికెట్ కొనడానికి, ఫ్రెండ్స్ కు బర్త్ డే పార్టీ ఇవ్వడానికి ఇష్టపడని ఓ పిసినారి పాత్రలో సత్య కనిపించనున్నాడు. కరోనా పుణ్యమా! అని లాక్‌డౌన్ రావడంతో 30మందితో సింపుల్‌గా పెళ్లి తంతు కానిచ్చేస్తాడు. లాక్‌డౌన్ పొడిగించడంతో పెళ్లివారికంతా సత్య ఇంట్లోనే తిష్టవేస్తారు. కామెడీ కమ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెరపైనే చూడాలంటోంది మూవీ టీమ్. సందీప్ కిషన్ పాత్ర సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని.. రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకుని సినిమాను తెరకెక్కించామని చెబుతున్నారు టీమ్ సభ్యులు. వివాహ భోజనంబుతో వినోదాల విందు గ్యారెంటీ అనేలా టీజర్ ఉండడంతో అది నిజమే అనిపిస్తోంది.
- December 20, 2020
- Archive
- సినిమా
- RGV RAJ
- SANDEEP KISHAN
- VENKATADRI
- VIVAHABOJANBU
- ఆర్జీవీ రాజ్
- వివాహ భోజనంబు
- వెంకటాద్రి టాకీస్
- సందీప్ కిషన్
- Comments Off on వినోదాల విందు.. ‘వివాహ భోజనంబు’