Breaking News

విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు తెరవద్దు

విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు తెరవద్దు​

  • రాత్రిపూట కర్ఫ్యూ ఉండదు
  • కేంద్ర హోంశాఖ అన్​లాక్​3.0 మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: అన్​లాక్​3.0 మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ బుధవారం విడుదల చేసింది. జూలై 31తో అన్‌లాక్‌ 2.0 గడువు ముగియనుండడంతో.. కేంద్రప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. సినిమా హాళ్లు, వినోద పార్కులు, బార్లు మూసివేయాలని సూచించింది. స్విమ్మింగ్ పూల్స్, యోగా సెంటర్లు, జిమ్​లకు కేంద్రం అనుమతిచ్చింది. విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లను మూసివేయాలని సూచించింది. రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేసింది. ఎట్‌ హోం కార్యక్రమాలపై రాష్ట్రపతి, గవర్నర్లు నిర్ణయం తీసుకుంటారని స్పష్టంచేసింది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని పేర్కొంది.