Breaking News

వానొచ్చాక మన రోడ్ల సిత్రాలు

సారథి న్యూస్, రామడుగు: మాములు సమయాల్లో ఎలాగో కష్టపడుతూ ఆ గుంతలు, మిట్టలో కాస్త ఇబ్బందికరంగానైనా మనం రోడ్డు ప్రయాణాలు చేస్తుంటాం.. కానీ వానొచ్చనప్పడు వాటి పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. రోడ్డు నిండా నిలిచిన నీళ్లు.. ఎక్కడ ఏ గొయ్యి ఉందో తెలియదు. కళ్లు మూసుకొని దేవుడిమీదే భారం వేసి వెళ్లాల్సి వస్తుంది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీవర్షాలకు రోడ్లు గతుకులు పడ్డాయి.. శ్రీరాముల పల్లి రోడ్డును ఆనుకొని, మోడల్ స్కూల్ మీదుగా వరద కాల్వ వరకు తారురోడ్డు వేశారు. కానీ మోడల్ స్కూల్ దాటాక దాదాపు 100 మీటర్ల వరకు రోడ్డు వేయకపోవడంతో వర్షాలకు రోడ్డు తెగి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అటుగా వెళ్లే పాదచారులు, మర్నింగ్​ వాకింగ్ వెళ్లే వారు, వాహనాల మీద వచ్చే పోయే వారు సైతం అదుపుతప్పి పడిపోతున్నారు.