సారథి న్యూస్, హుస్నాబాద్: వానాకాలంలోగా జిల్లాల్లో రైతువేదికలు నిర్మించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. శనివారం సిద్దిపేట కలెక్టరేట్ లో సమీక్షించారు. రెండు నెలలలోపు జిల్లాలో 126 రైతు వేదిక నిర్మాణాలు పూర్తిచేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని, ఇందుకోసం జిల్లాస్థాయిలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఏజెన్సీలను మంత్రి కోరారు. రైతు వేదికల నిర్మాణాలకు నిధుల కొరత లేదని, జిల్లాలో 126 వేదికల నిర్మాణాలు చేపట్టాలని, ఒక్కోదానికి రూ.22లక్షల చొప్పున రూ.15.19 కోట్లు మంజూరైనట్లు మంత్రి వెల్లడించారు. సమావేశంలో కలెక్టర్ వెంకట్రామరెడ్డి, అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, డీపీవో సురేశ్ బాబు, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ కనకరత్నం పాల్గొన్నారు.
- June 20, 2020
- తెలంగాణ
- మెదక్
- HARISHRAO
- SIDDIPET
- రైతు వేదికలు
- సిద్దిపేట
- హరీశ్‌రావు
- Comments Off on వానాకాలంలోగా రైతు వేదికలు పూర్తి