సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమస్యలపై నిలదీస్తూ పలువురు సర్పంచ్‌లు సమావేశాన్ని అడ్డుకున్నారు. పంచాయతీలో చేస్తున్న ప్రతి పనికి కమీషన్లు అడుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారుల తీరుకు నిరసనగా జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య, సర్పంచ్‌లతో కలిసి నేలపై కూర్చుని నిరసన తెలిపారు. బుధవారం ఎంపీడీవో ఆఫీసులో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కోట్ల అశోక్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మీటింగ్ ప్రారంభంకాగానే పలువురు సర్పంచ్‌లు నిరసన తెలిపారు. ఏ చిన్న పనికైనా కమీషన్లు అడుగుతున్నారని వాపోయారు. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య హామీ ఇచ్చారు. తహసీల్దార్ కార్యాలయంలో కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు రైతులకు సంబంధించిన పనులు ముందుకు సాగడం లేదని కలుకుంట్ల సర్పంచ్ ఆత్మలింగారెడ్డి, పల్లెపాడు సర్పంచ్ విజయమ్మ అన్నారు. చండూరు గ్రామంలో వేలిముద్రలు సరిపడక రేషన్ బియ్యం, ఆసరా పింఛన్లు రావడం లేదని ఎన్నిసార్లు సభ దృష్టికి తీసుకొచ్చినా లాభం లేదని వాపోయారు. ఇలా ఎన్ని సమావేశాల్లో చర్చించుకోవాలని గ్రామ సర్పంచ్ నర్సింహులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపాధి పనులు చేస్తున్నారా..? లేదా? అనే విషయం కూడా సర్పంచ్‌లకు తెలియడం లేదని కొంతమంది సర్పంచ్‌లు, అమరవాయి ఎంపీటీసీ రోశన్న మండిపడ్డారు. హెల్త్డిపార్ట్మెంట్కు సంబంధించిన సమస్యలను సర్పంచ్ నారాయణ లేవనెత్తారు. సర్వసభ్య సమావేశానికి హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు జడ్పీ చైర్పర్సన్ సరితకు ఫిర్యాదు చేశారు.
- December 16, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- ముఖ్యమైన వార్తలు
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- ALAMPUR
- GADWALA
- MANAVAPADU
- ZP CHAIRPERSON
- అలంపూర్
- గద్వాల
- జడ్పీ చైర్పర్సన్
- జోగుళాంబ
- మానవపాడు
- Comments Off on వాడీవేడిగా మానవపాడు జనరల్‌బాడీ మీటింగ్