- నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్
న్యూఢిల్లీ: లాక్ డౌన్ కష్టకాలంలో వలస కూలీల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బాగా ఇంకా బాగా చర్యలు తీసుకోవాల్సి ఉందని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. శుక్రవారం ఒక మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా కేసులు కూడా తగ్గించగలిగామని, వలస కార్మికు సంక్షోభం సరిగా హ్యాండిల్ చేయలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.
‘వలస కార్మికుల సమస్య ఒక సవాలు. కార్మికుల గురించి పట్టించుకోవడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. మన లాంటి విస్తారమైన దేశంలో ఫెడరల్ ప్రభుత్వానికి పరిమిత పాత్ర. ఇది మనం బాగా చేయగలిగాం. ఇంకా చేయాల్సి ఉంది’ అని ఆయన అన్నారు. లాక్‌డౌన్ కారణంగా లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు వేలాది కిలోమీటర్లు నడిచి వెళ్లారు.