న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలు వరుసగా 15వ రోజు పెరిగాయి. ఆదివారం డీజిల్‌పై 0.60 పైసలు, డీజిల్‌పై 0.35 పైసలు పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో వారం రోజుల్లో పెట్రోల్‌పై రూ.8.88, డీజిల్‌పై రూ.7.97 మేర పెరిగింది. చమురు మార్కెటింగ్ సంస్థల ధర నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.79.23కి చేరగా.. డీజిల్ ధర రూ.78.27కి చేరింది. ఢిల్లీలో 2018లో ఇంత స్థాయిలో ధరలు పెరగిగాయని విశ్లేషకులు చెప్పారు. 2018 అక్టోబర్‌లో డీజిల్ రేటు రూ.75.69, పెట్రోల్ ధర రూ.84కు చేరిందని చెప్పారు. ఈనెల 7నుంచి పెట్రోల్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి.
దేశంలోని టాప్ సిటీస్‌లో రేట్లు
సిటీ పెట్రోల్ (రూ.) డీజిల్ (రూ.)
న్యూఢిల్లీ 79.23 78.2
ముంబై 86.04 76.69
చెన్నై 82.58 75.80
హైదరాబాద్ 82.25 76.49
బెంగళూరు 81.81 74.40
- June 21, 2020
- Top News
- DELHI
- PETROL
- చమురు సంస్థలు
- పెట్రోల్ రేట్లు
- Comments Off on వరుసగా పెట్రో మంట