Breaking News

వనపర్తి వాసులు అప్రమత్తంగా ఉండాలి

వనపర్తి వాసులు అప్రమత్తంగా ఉండాలి

సారథి న్యూస్​, వనపర్తి: ఇటీవల భారీవర్షాలకు జిల్లావ్యాప్తంగా వాగులు, చెరువులు, నదులు ప్రమాదకరంగా ఉప్పొంగుతూ ప్రవహిస్తున్న నేపథ్యంలో ముంపు కాలనీల్లో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వనపర్తి ఎస్పీ అపూర్వరావు సూచించారు. జిల్లా కేంద్రంలోని తాళ్లచెరువు వాగు అలుగు ఉప్పొంగి వరద నీరు శ్రీరామ టాకీస్, శ్వేతానగర్, శంకర్ గంజ్, ప్రభుత్వ ఆస్పత్రి, చింతల హనుమాన్ ఆలయం, సుభాష్ వాడ ప్రాంతాల్లో రోడ్లపై వరదనీరు వచ్చి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లాలోని ప్రతి పోలీస్​స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల నీటి ప్రవాహం గురించి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రత్యక్షంగా వెళ్లి పర్యవేక్షిస్తూ, సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమన్వయంతో కలిసి రక్షణ చర్యలు చేపట్టారని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించారు. ఏదైనా విపత్కర సమయంలో డయల్ 100 లేదా, కంట్రోల్ రూమ్ 08545-231100, 08545-233331, వాట్సాప్ 6303923200 ఫోన్​చేయాలని ఆదేశించారు.