మెక్సికో సిటీ : భారీ భూకంపంతో మెక్సికో నగరం వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7 గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దక్షిణ మెక్సికోలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టుగా తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.29 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ఆక్సాకా స్టేట్ పసిఫిక్ తీరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయినట్టుగా సమాచారం. భూకంప ప్రభావంతో మెక్సికోలో పలు భవనాలు కంపించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి భయంతో పరుగులు తీశారు. మరోవైపు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను అక్కడ నుంచి తరలించారు. 2017లో మెక్సికోలో భూకంపం కారణంగా 355 మంది మృతి చెందారు.
- June 24, 2020
- Archive
- జాతీయం
- EARTHQUAKE
- MEXICO
- PEOPLE
- భయం
- భారీ భూకంపం
- Comments Off on వణికిన మెక్సికో