సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో ఉన్న ఏకైక మధ్యతరహా ప్రాజెక్ట్ ఘనపూర్ ఆనకట్టను ఇక నుంచి వనదుర్గా ప్రాజెక్టుగా వ్యవహరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మిస్తున్న పలు పథకాలకు ప్రభుత్వం దేవుళ్ల పేర్లు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వందేళ్లకు పైగా ఘనచరిత్ర కలిగిన ఘనపూర్ ఆనకట్టకు వనదుర్గా ప్రాజెక్టుగా నామకరణం చేస్తూ సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. నిజాం నవాబుల పాలనాకాలంలో కొల్చారం మండలం చిన్నఘనపూర్ గ్రామ సమీపంలో మంజీర నదిపై 1905లో ఈ ఆనకట్ట నిర్మితమైంది. ఏడుపాయల వనదుర్గామాతా ఆలయ సమీపంలో ఉండడంతో సీఎం కేసీఆర్దీనికి వనదుర్గా ప్రాజెక్ట్ అనే పేరు ఖరారుచేశారు.
- August 11, 2020
- Archive
- తెలంగాణ
- ముఖ్యమైన వార్తలు
- మెదక్
- CM KCR
- GHANAPUR PROJECT
- MANJEERA RIVER
- VANADURGA
- ఘనపూర్ప్రాజెక్టు
- మంజీరా నది
- వనదుర్గ
- సీఎం కేసీఆర్
- Comments Off on వందేళ్ల ఘనపూర్ ఆనకట్టకు వనదుర్గ పేరు