సారథి న్యూస్, బిజినేపల్లి: మహిళా సంఘాలకు కేటాయించిన నిధులు దుర్వినియోగం అయ్యాయని నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం సల్కరిపేట గ్రామ మహిళా సంఘం సభ్యులు సోమవారం మండల మహిళా సమాఖ్య కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సల్కరిపేట ఎంపీటీసీ సభ్యుడు అంజి మద్దతు తెలిపారు. మహిళలను మోసగించిన సమాఖ్య ఉద్యోగులను తొలగించి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామసీసీ, బుక్ కీపర్ కలిసి మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. రూ.లక్షకు రూ.రెండువేల చొప్పున ఒక్కో సంఘం వద్ద వసూలు చేశారని ఆరోపించారు. రుణాల పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడతానని, విచారణ జరిపించి న్యాయం చేస్తామని ఏపీఎం సుజాత హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
- September 22, 2020
- Archive
- BIJINEPALLY
- MAHILASAMAKYA
- NAGARKURNOOL
- నాగర్కర్నూల్
- బిజినేపల్లి
- మహిళా సమాఖ్య
- Comments Off on లోన్లు అడిగితే.. డబ్బులు డిమాండ్ చేస్తున్రు