చిలిపిగా కవ్విస్తుంది.. మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది.. మొత్తానికి నటనతో మెస్మరైజ్ చేస్తుంది నివేదా పేతురాజ్. ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది. ‘బ్రోచేవారెవరురా’, ‘చిత్రలహరి’, ‘అల వైకుంఠపురము’లో సినిమాలతో మెప్పించిన నివేదా ప్రస్తుతం రామ్ రెడ్ చిత్రంతో పాటు సాయిధరమ్ తేజ్, దేవా కట్టా కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది.
అలాగే తమిళంలోనూ పార్టీ, పొన్ మాణిక్వేల్ మూవీస్ తో పాటు విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కనున్న ‘జెగజాల కిల్లాడీ’ అనే సినిమాకు సంతకం చేసింది. వరుస ఆఫర్స్ వస్తున్నా కూడా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించడానికి రెడీ అయింది నివేదా పేతురాజ్. ‘కార్తికేయ’, ‘ప్రేమమ్’, ‘సవ్యసాచి’ చిత్రాల దర్శకుడు చందు మొండేటి డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.
కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను బుధవారం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు. సింగిల్ షెడ్యూల్ లోనే షూట్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇతర టెక్నిషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.