![లివర్‌పూల్ కల నెరవేరింది](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/football-final.jpg?fit=404%2C333&ssl=1)
లివర్‌పూల్: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మూడు దశాబ్దాల తర్వాత లివర్‌పూల్ తమ కల నెరవేర్చుకుంది. ప్రతిష్టాత్మక ఇంగ్లిష్ ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్లో 31 మ్యాచ్‌ల్లో 28 విజయాలు, 2 డ్రాలతో 86 పాయింట్లు సాధించిన ఆ జట్టు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న మాంచెస్టర్ టీమ్.. తాజాగా జరిగిన మ్యాచ్‌లో 1–2 తేడాతో చెల్సీ చేతిలో ఓడిపోవడంతో లివర్‌పూల్‌కు టైటిల్ ఖాయమైంది. మరో ఏడు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే టైటిల్ దక్కడంతో లివర్‌పూల్ అభిమానులు వీధుల్లోకి వచ్చి టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.