- మంత్రి సబితాఇంద్రారెడ్డి
సారథి న్యూస్, మహేశ్వరం: రైతులకు నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పోతర్ల బాలయ్య ఫంక్షన్ హాల్ లో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రైతులు లాభాసాటి పంటలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత, మహేశ్వరం ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ జ్యోతి, కందుకూరు మండల ఎంపీపీ జ్యోతి పాల్గొన్నారు.