న్యూఢిల్లీ: కరోనా కోరలు చాచిన సమయం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. నివారణ మార్గాలను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా దేశప్రజలకు వెల్లడించేవారు. ఆయనే కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. ప్రస్తుతం ఆయన కూడా కరోనా బారినపడ్డారు. వైద్యపరీక్షల అనంతరం తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని ట్విటర్ వేదికగా వెల్లడించారు. నిబంధనల ప్రకారం తాను ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కోరారు. కరోనాతో లాక్‌డౌన్ విధించిన సమయంలో దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితి, కేంద్రం తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై ఆయన తరచూ మీడియా సమావేశాల్లో వివరించిన విషయం తెలిసిందే.
- August 14, 2020
- Archive
- Top News
- జాతీయం
- HEALTH MINISTRY
- INDIANBUREAUCRAT
- ISOLATION
- LAVAGARWAL
- ఐసోలేషన్
- కేంద్ర వైద్యశాఖ కార్యదర్శి
- లవ్ అగర్వాల్
- Comments Off on లవ్ అగర్వాల్‌కు కరోనా