‘పలాస 1978’ సినిమాతో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు రఘు కుంచె. నటుడిగా, సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న రఘు కుంచె మళ్లీ నటుడిగా బిజీ అవుతున్నారు. తనకు తగ్గ పాత్రల్లో నటిస్తూ కొత్త బాటలు వేసుకుంటున్నారు. ‘పలాస 1978’ చిత్రంలోని నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈసారి హీరోగా కనిపించబోతున్నారు. అదీ ఓ పిరియాడిక్ మూవీలో. 1991లో జరిగిన ఓ అన్ టోల్డ్ స్టోరీని ‘కథా నళిని’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. 29 ఏళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న ఓ మహిళ కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. గోగో మూవీస్ బ్యానర్స్‌పై తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది. స్టార్ హీరోయిన్ టైటిల్ పాత్రలో నటించనుండగా ఆమె భర్తగా రఘు కుంచె మురుగన్ పాత్రలో కనిపించనున్నారు. మహేంద్ర కొక్కిరిగడ్డ రచన, దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి \సంగీతం కూడా రఘు కుంచె అందించనున్నారు.
- July 6, 2020
- Archive
- సినిమా
- GOGO MOVIES
- KATHA NALINI
- PALASA
- RAGHU KUNCHE
- కథా నళిని
- పలాస
- రఘుకుంచె
- Comments Off on రఘు కుంచె హీరోగా పిరియాడిక్ మూవీ