సారథిన్యూస్, కొత్తగూడెం: పాత నేరస్థులు, రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ ఆదేశించారు. జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బందితో శుక్రవారం ఆయన ఎస్పీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటుచేయాలని సూచించారు. సీసీ టీవీ కెమెరాలు నిరంతరం పనిచేసే విధంగా పోలీసు అధికారులు శ్రద్ద తీసుకోవాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మణుగూరు ఏఎస్పీ శబరీశ్, వినీత్ కుమార్, ఎస్ఐలు, సీఐలు శ్రీనివాసరావు, రవి, గురుస్వామి, రాజగోపాల్, అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
- July 3, 2020
- Archive
- ఖమ్మం
- POLICE
- ROWDYSHEETERS
- SP
- SUNEEL DATH
- ఐపీఎస్
- రౌడీషీటర్లు
- Comments Off on రౌడీషీటర్లపై నిఘా