Breaking News

రోడ్ల పనులు స్పీడ్​ అప్ చేయండి

రోడ్ల పనులు స్పీడ్​ అప్ చేయండి
  • అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష

సారథి న్యూస్, హైదరాబాద్: నగరంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులను పూర్తిచేసేందుకు అధికారులు మరింత వేగవంతంగా ముందుకెళ్లాలని మంత్రి కె.తారక రామారావు సూచించారు. శనివారం బుద్దభవన్ లో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్​శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, కమిషనర్ డీఎస్. లోకేష్ కుమార్ తో కలిసి హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కింద చేపట్టాల్సిన పనుల ప్రగతిపై సమీక్షించారు.

దేశంలో వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. మే నెలలో కొన్ని పనులను ప్రారంభిద్దామని, అందుకు అనుగుణంగా పనులకు తుది మెరుగులు దిద్దాలని సూచించారు.

నేషనల్​ హైవేలను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న లింక్ రోడ్ల వెడల్పు 120 అడుగులు ఉండాలని, భవిష్యత్​ లో ఆయా లింక్ రోడ్లతో సమీప ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఎస్ఆర్డీపీ, లింక్, సర్వీస్ రోడ్లను మరింత ప్రయోజనకరంగా పొడిగించేందుకు హెచ్ఎండీఏ, ఇతర విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎంపీ, కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ఎండీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, సీసీసీ దేవేందర్ రెడ్డి, ఈఎన్ సీ శ్రీధర్, చీఫ్ ఇంజనీర్ జియాద్దీన్, ఎస్ఈలు, ఈఈలు, భూసేకరణ విభాగం అధికారులు పాల్గొన్నారు.