డిఫరెంట్ కథలనే ఎంచుకుంటాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘నీది నాది ఒకే కథ’, ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచే వారెవరురా’, ‘తిప్పరా మీసం’.. ఇలా విష్ణు సినిమాలన్నీ వైవిధ్యంగానే ఉంటాయి. అలా స్టైల్ మెయిన్ టెయిన్ చేయడంతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు పొందాడు విష్ణు. ప్రస్తుతం వివేక ఆత్రేయ అసిస్టెంట్ అసిత్ గోలి డైరెక్షన్లో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి కట్టుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
లాక్ డౌన్ కారణంగా 60శాతం పూర్తయిన ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది. అయితే జూలై ఈ సినిమా షూటింగ్ మొదలు పెడదామనుకున్నా కరోనా విజృంభన నానాటికీ పెరుగుతున్న కారణంగా సినిమాను సెప్టెంబర్లో సెట్ పైకి తీసుకెళ్లనున్నారని సమాచారం. అయితే ఇప్పటి వరకూ సీరియస్ సినిమాలే చేసిన శ్రీవిష్ణు ఇప్పుడు మరో సినిమాలో రొమాంటిక్ యాక్షన్ని ట్రై చేయనున్నాడట. సతీష్ అనే కొత్త దర్శకుడు చెప్పిన రొమాంటిక్ స్టోరీకి ఎగ్జయిట్ అయి ఆ సినిమా చేయాలనుకుంటున్నాడట. సెప్టెంబర్ప్రీ ప్రొడక్షన్ మొదలు పెట్టనున్న ఈ సినిమా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో పట్టాలెక్కనుందట.