సారథి న్యూస్, వెల్దండ: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావిస్తున్న రైతు వేదికల నిర్మాణానికి నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, కలెక్టర్ ఈ.శ్రీధర్ శ్రీకారం చుట్టారు. శుక్రవారం వెల్దండ మండలం కొట్ర గ్రామంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి రైతు వేదిక పనులకు శంకుస్థాపన చేశారు. వీలైంత తొందరగా పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన శ్మశానవాటికను ప్రారంభించడంతో పాటు ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచాలని స్థానిక వార్డు సభ్యుడు కె.హరిశ్చంద్రప్రసాద్ ఎమ్మెల్యే, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీపీవో సురేష్‌మోహన్, ఎంపీపీ విజయ జైపాల్‌నాయక్, వైస్‌ఎంపీపీ శాంతి, జడ్పీటీసీ సభ్యులు విజితారెడ్డి, భరత్‌ప్రసాద్, కల్వకుర్తి మార్కెట్‌చైర్మన్ బాలయ్య, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు యెన్నం భూపతిరెడ్డి, కొట్ర సర్పంచ్ పి.వెంకటేశ్వర్రావు, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు, తహసీల్దార్ సైదులు, ఏవో మంజుల, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పి.భాస్కర్‌రావు పాల్గొన్నారు.
- June 26, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- KOTRA
- MLA JAIAPLYADAV
- RYTHUVEDIKA
- నాగర్‌కర్నూల్
- రైతు వేదిక
- Comments Off on రైతు వేదికకు శ్రీకారం