సారథి న్యూస్, పాల్వంచ: సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్ట రైతుల పక్షపాతని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పాల్వంచ కో ఆపరేటివ్ సొసైటీ కి కొత్త సభ్యులకుగాను రూ.65 లక్షలు మంజూరయ్యాయి. పాల్వంచ సొసైటీ కార్యాలయంలో గురువారం వనమా రైతులకు పంట రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వనమా మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అయిన తర్వాత రైతులకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టి రూ.లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారన్నారు. రైతుబంధు పథకం పేరుతో ఎకరానికి రూ.10వేలు పెట్టుబడి సాయం చేస్తున్నారన్నారు. రైతు మరణిస్తే వారి కుటుంబానికి రూ.ఐదు లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్నారని కొనియాడారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ, ప్రభుత్వమే నేరుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. రైతు వేదికలు ఏర్పాటు చేసి, రైతులను, అధికారులను ఒక చోట చేర్చి రైతు సమస్యలను పరిష్కరించేందుకు కంకణం కట్టుకుందన్నారు. కార్యక్రమానికి డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు, సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు కంచర్ల చంద్రశేఖర్, డీసీవో మైఖేల్ బోస్, తహసీల్దార్ భగవాన్ రెడ్డి, ఎంపీడీవో ఆల్బర్ట్, జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, రైతు సమన్వయ సమితి కన్వీనర్ కిలారు నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖాధికారి శంకర్, సహకార బ్యాంకు మేనేజర్ జి.వసుమతి, సొసైటీ డైరెక్టర్లు బుడగం రామ్మోహన్ రావు, ఎర్రంశెట్టి మధుసూదనరావు, మైనేని వెంకటేశ్వరరావు, సామా జనార్దనరెడ్డి, నిమ్మల సువర్ణ తదితరులు పాల్గొన్నారు.