Breaking News

రైతువేదికలతో ఎంతో మేలు

రైతువేదికలతో ఎంతో మేలు

సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందని అందుకు సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేట మండలం, మెదక్ పట్టణంలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం యూసుఫ్ పేటలో డబుల్ బెడ్​రూమ్​ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పట్టణాలకు దీటుగా గ్రామాలను తీర్చిదిద్దడమే ధ్యేయమన్నారు. గ్రామాలు శుభ్రంగా ఉంటే ఎలాంటి రోగాలు రావాలన్నారు. వైకుంఠ ధామాలు, డంపింగ్​యార్డుల నిర్మాణాలను పూర్తిచేయాలని సూచించారు. రైతు వేదికల ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పల్లెల ప్రగతికి అనేక కార్యక్రమాలు చేపడుతూ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. మల్లంపేట, యూసుఫ్ పేట గ్రామాన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపారని స్థానిక సర్పంచ్ ను అభినందించారు.
ప్రణాళికాబద్ధంగా పట్టణాల అభివృద్ధి
మున్సిపాలిటీల్లో ఆదాయ వనరులను పెంచుకోవడంతో పాటు అభివృద్ధి సాధించే విషయంలో మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి టి.హరీశ్​రావు సూచించారు. శనివారం మెదక్ కలెక్టరేట్ లో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల చైర్మన్లు, కమిషనర్లతో సమీక్షించారు. మున్సిపాలిటీలను మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. తడిపొడి చెత్తను వేర్వేరుగా సేకరించారు. ఆగస్టు 15వ తేదీలోగా మంజీరా నీటిని అన్ని ఇళ్లకు అందించాలని సూచించారు. ప్రతినెలా కరెంట్ బిల్లులను తప్పకుండా చెల్లించాలని విద్యుత్ పొదుపు పాటించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్, పాపన్నపేట జడ్పీటీసీ షర్మిల, ఎంపీపీ చందన పాల్గొన్నారు.