సారథి న్యూస్, బిజినేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్నసబ్సిడీ యంత్రపరికరాలను సద్వినియోగం చేసుకోవాలని ఏడీఏ రమేష్ బాబు సూచించారు. బుధవారం నాగర్ కర్నూల్జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి, వడ్డెమాన్గ్రామాల్లో 13 మంది రైతులకు గడ్డి కోసే మిషన్లను సబ్సిడీపై అందజేశారు. మిషన్ ధర రూ.25,800 ఉంటుందని, కేవలం 25శాతం డబ్బులు చెల్లిస్తే సరిపోతుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకుని అధిక లాభాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో నీతి, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, రైతు సమన్వయ మండలాధ్యక్షుడు మహేశ్ రెడ్డి పాల్గొన్నారు.
- September 16, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BIJINEPALLY
- GRASSCUTTING MACHINE
- NAGARKURNOOL
- ఏవో
- గడ్డికోసే మిషన్
- నాగర్కర్నూల్
- బిజినేపల్లి
- Comments Off on రైతులకు సబ్సిడీపై గడ్డికోత మిషన్