Breaking News

రైతులకు వరం నూతన రెవెన్యూ చట్టం

రైతులకు వరం నూతన రెవెన్యూ చట్టం

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్రంలోని భూవివాదాలకు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ గారు ఎంతో పారదర్శకంగా నూతన రెవెన్యూ చట్టాన్ని అమలు చేశారని, తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యమే సాగుతుందని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం రామగుండం బీ పవర్ హౌస్​ వద్ద ట్రాక్టర్లను వారు ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రైతుల భూముల కష్టాలను పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు. సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా నూతన చట్టాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు.

ఒకేరోజు రిజిస్టేషన్, పాస్ బుక్, మోటేషన్ అమలు కానుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దసరాకు ధరణి పోర్టల్ ను అమలు చేయనున్నారని తెలిపారు. కార్యక్రమంలో అంతర్గాం మండల ఎంపీపీ దుర్గంవిజయ, వాల్వ అనసూర్య, జడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపీపీలు మట్ట లక్ష్మీ, మహేందర్ రెడ్డి, ఎర్రం స్వామి, సర్పంచ్ లు ధరణి రాజేష్, శ్రీనివాస్, సతీష్, బండారి ప్రవీణ్ కుమార్, ధరణి కృష్ణ, కోఆప్షన్ సభ్యులు గౌస్​పాషా, రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు పాతపెల్లి లక్ష్మీ, ఎల్లయ్య, సాగంటి శంకర్, కుమ్మరి శ్రీనివాస్, ఎన్వీ రమణరెడ్డి, కల్వచర్ల కృష్ణవేణి, భూమయ్య, కాల్ప స్వరూప, శ్రీనివాస్ పాల్గొన్నారు.