Breaking News

రైతులకు పరిహారం చెక్కులు

సారథి న్యూస్​, కరీంనగర్​: కరీంనగర్​ జిల్లా మానకొండూరు నియోజవర్గంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం పర్యటించారు. కాళేశ్వరం జలాలను తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో తీసుకెళ్లే క్రమంలో భూములు కోల్పోతున్న రైతులకు పర్లపల్లి గ్రామంలో చెక్కులు పంపిణీ చేశారు. ఆయన వెంట మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్​కుమార్​ ఉన్నారు.