Breaking News

రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు

రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్య కొనుగోళ్లు

సారథి న్యూస్, ములుగు: రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్య కొనుగోలు చేపట్టాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం ఆయన వెంకటాపూర్ లో పీఏసీఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల్లో తాగునీరు, కనీస మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు. కొనుగోలులో నిబంధనలు పాటించాలన్నారు. ప్రక్రియ నమోదు ఎప్పటికప్పుడు చేయాలని, మిల్లులకు ధాన్య రవాణాకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టి తేమశాతం చూసుకుని కేంద్రాలకు తీసుకుని వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. అంతకు ముందు ఆయన ఇంచెర్ల, వెంకటాపూర్ పంచాయతీ కార్యాలయాలను తనిఖీ చేశారు. జాకారంలోని కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లను పరిశీలించారు. పత్తి కొనుగోళ్లలో రికార్డులు నిర్వహించాలని ఆయన సూచించారు. వెంకటాపూర్ ఎంపీడీవో శ్రీధర్, అధికారులు ఉన్నారు.